🙏ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః🙏
🙏ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః🙏 పదహారు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ' ఉన్మేష నిమిషోత్పన్న విపన్నభువనావళ్యి నమః' అని చెప్పాలి. ఉన్మేష = తెరువబడుటతోను, నిమిష = మూయబడుటతోను, ఉత్పన్న = పుట్టిన, విపన్న = లీనమైన, భువన + ఆవళిః = భువనావళిః = చతుర్దశ భువనములు కలది. అమ్మవారి కనురెప్పలు తెరుచుకోడం చతుర్దశ భువనాలు ఉత్పత్తికి, కనురెప్పలు మూసుకోడం వాటి విపత్తికి, అంటే - లయానికి కారణ భూతమౌతాయి. రెప్పలు తెరవడమే జరగక్కర లేదు, మూయడమే కానక్కరలేదు. ఆవిడ కనురెప్పలను తెరుద్దామని, మూద్దామని సంకల్పించినా చాలు - ఇలా జరుగుతుంది అని అర్థం. అంటే - అమ్మవారికి రెప్పపాటు కాలం చాలు బ్రహ్మాండాలను సృష్టించడానికి, లయం చేసుకోడానికి - అని గూడా అర్థం. ఉత్ + మేషం = ఉన్మేషం - అంటే మేషరాశితో ప్రారంభించి, ని + మేషం - అంటే మేషం దగ్గర కొచ్చి అయిపోవడం' - అని అర్థం చేసుకుంటే - ఈ రెండు స్థితులకు మధ్యన చిట్టచివరగా ఉండే మీనరాశి (జలరాశి) వస్తుంది. మీనం అంటే “మత్స్యం '. అంటే, సృష్టి ప్రళయాల మధ్య మీనరాశికి సంబంధించిన కథ ఉంటుంది అని అర్థం. ఈ కథ మత్స్య పురాణంలో • మత్స్యావతార...