🌹🙏శ్రీ మాతా🙏🌹
🌹🙏శ్రీ మాతా🙏🌹
శ్రీ మాత అంటే ఏంటో వివరంగా తెలుసుకుందాము..శ్రీ అన్ని శుభాలకు నిలయం ,అన్ని సిద్ధులకు ప్రతి రూపం అనగా శ్రీ అంటే సంపదకు, జ్ఞానానికి, శక్తికి, ప్రతి రూపం ఈ మూడు సుగుణ సంపదలకు రూపం లక్ష్మీ ,పార్వతి, సరస్వతి.. ఈ త్రిమాతల ఉద్భవించింది తన నుండి కనుక శ్రీ మాతా అయినది...రుద్రాణీలకు ఈమె మూలం , పరాశక్తి గా పరాబట్టరిక గా పరదేవతగా పరమేస్వరుడి అర్ధాంగిగా ఈమెయే జగతికి ములధారమైన ఉన్నందు వల్లనే శ్రీ మాతా అన్న నామంతో పిలుస్తారు.
ఈ జగన్మాత సృష్టికి పూర్వమే ఉన్నది వేదముల అన్నిటి కన్నా ముందు ప్రణవమై విరాజిల్లు తున్నది... సఖల చరాచర సృష్టి ప్రాణకోటి.. గుణము ,నిర్గుణము, రూపము కలిగిన వాటికి రూపము లేని శక్తి కి కూడా ఈమెయే మూలము అన్ని భూతములకు ఆది భూతమై సృష్టికి మూలాధారమై, సకల ప్రాణ కోటికి అన్ని అవసరములు తీర్చునది ,ప్రాణకోటికి అభయ ప్రదాయినిగా , సకల బ్రహ్మండంబులు తనలోనివై.. ఈ జగన్మాత శ్రీ మాతా అయినది..
సృష్టికార్య నిర్వహనులైన త్రిమూర్తులకు సృష్ట్యధుల నొనర్పు సగున బ్రహ్మగా ఈ తల్లి శ్రీ మాత అయినది.. శ్రీ అంటే విషము . మాతి అంటే కంఠము నందు నుంచుకొనునది .శ్రీ అనగా విషము అని అర్థము కూడా ఉండటం వల్ల ఈ తల్లి సృష్టి సంహారం చేయును అని ఇంకో అర్తం ఉన్నది.
త్రిమూర్తులు ఒక దివ్య విమానం ఎక్కి మణిద్విపము చేరుతారు అక్కడ పరమేశ్వరి శ్రీ చక్రం మీద కూర్చుని దర్శనమిస్తుంది. అప్పుడు బ్రహ్మ దేవుడు "తల్లీ నీవే పరమేశ్వరివా ? నీవే పరబ్రహ్మా వా? నీ తత్వాన్ని మాకు వివరించవలసినది అని కోరినప్పుడు... దేవి ఇలా చెబుతోంది... నీటిలోని చల్లదన్నాని నేనే, అగ్ని లోని వెచ్చ ధనాన్ని నేనే. సూర్యుని లోని తేజస్సును, చంద్రుని లోని మంచును నేనే. నేను లేని వస్తువు జగత్తు లో ఏదీ లేదు. మీ త్రిమూర్తుల అందు శక్తి ని నేనే.. ఈ చరాచర జాగ్రత్త అంతా నేనే నిండి యున్నాను.. అని చెబుతుంది. ఆ పరమేశ్వరియే శ్రీ మాత. ఆమె శక్తి స్వరూపిణి.అట్టి శ్రీ మాతను నిత్యము స్మరించు కుందాము..సకలసద్గుణ సంపన్నురాలు, పవిత్ర మూర్తి అయిన ఆ తల్లి సుఖసంపదలు, భోగభాగ్యాలనే కాదు, శ్రీ రూపమును అమృతత్వాన్ని కుడా ప్రసాదిస్తుంది.
అంతా అమ్మే అని తెలుసుకున్నాము కదా ఈ నామ జపం చేస్తూ ప్రతి యొక్క వస్తువు నందు గుణమును చూసి అంటే నీటిని తాకినప్పుడు ఆ చల్లదనాన్ని అమ్మవారిగా ఇలా ప్రతి చర్యలో అమ్మవారిని జ్ఞాపకం చేసుకుంటూ నామము స్మరించు కుంటూ కుదిరితే ఈ నామాన్ని కాసేపు ధ్యానం చేయండి ఓం శ్రీ మాత్రే నమః...
శ్రీ మాత,శ్రీ అనగా సేవించుట అని అర్థం. తనను సేవించువారిని తాను సేవిస్తుంది అమ్మవారు. అందుకే అమ్మవారిని శ్రీమాత అంటారు. శ్రీ అంటే లక్ష్మి, భూమి, సంపద, విజయం, కాంతి, జ్ఞానం, విద్య అనే అర్థాలున్నాయి. మాత అంటే కన్నతల్లి. అనేక విధాలైన సంపదలను ప్రసాదించే తల్లి కాబట్టి అమ్మవారిని శ్రీమాత అంటారు. ఐం-అనేది వాక్కును ఇచ్చే బీజం. ఇది సరస్వతి బీజం . హ్రీం-భువనేశ్వరీ బీజం, శ్రీం - ఐశ్వర్య బీజం, వీటిని కలిపి శ్రీ మాతా అనే అమ్మవారి నామాన్ని ఓంకారం ఇదే సృష్టికి మూలం.
🌹ఫలిస్తుతి🌹
ఈ నామాన్ని మంత్రంగా జపిస్తే దుఃఖనాశనమని వామకేశ్వరతంత్రం చెబుతోంది. పిల్లలు సరిగ్గా ప్రవర్తించక తల్లిదండ్రులను ఏడిపిస్తున్నపుడు, తల్లిదండ్రులు సరిగా లేక పిల్లలను బాధపెడుతున్నపుడు, పొరుగింటి వారివల్ల మనశ్శాంతి కరువైనప్పుడు వచ్చే దుఃఖం ఈ మంత్రజపం వల్ల తొలగుతుంది.సంపదలు లభిస్తాయి. కోరికలు లేకుండా జపిస్తే ఎప్పుడు ఏది అవసరమో అది ప్రాప్తిస్తుంది. దీనిని ఎవరైనా జపం చేసుకోవచ్చు. ఉచ్చారణా దోషంలేకుండా జపం చేయాలి, ఈ మంత్రం ఒక సంవత్సరకాలం జపిస్తే సంతానం కలుగుతుంది. స్థిరనివాసం కలుగుతుంది. ఉపాధి, కలుగుతుంది, విద్యార్థులకు మంచి జ్ఞాపక శక్తి లభించి గొప్ప భవిషత్తు ఏర్పడుతుంది..పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు ఈ నామ జపం చేయవచ్చు.
🌹ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః🌹
🌹(శక్తి ఆరాధన శ్రీ చక్ర ఉపాసన)🌹

Comments
Post a Comment