🙏ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః🙏
🙏ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః🙏
ఉన్మేష = తెరువబడుటతోను,
నిమిష = మూయబడుటతోను, ఉత్పన్న = పుట్టిన,
విపన్న = లీనమైన,
భువన + ఆవళిః = భువనావళిః = చతుర్దశ భువనములు కలది.
అమ్మవారి కనురెప్పలు తెరుచుకోడం చతుర్దశ భువనాలు ఉత్పత్తికి, కనురెప్పలు మూసుకోడం వాటి విపత్తికి, అంటే - లయానికి కారణ భూతమౌతాయి. రెప్పలు తెరవడమే జరగక్కర లేదు, మూయడమే కానక్కరలేదు. ఆవిడ కనురెప్పలను తెరుద్దామని, మూద్దామని సంకల్పించినా చాలు - ఇలా జరుగుతుంది అని అర్థం. అంటే - అమ్మవారికి రెప్పపాటు కాలం చాలు బ్రహ్మాండాలను సృష్టించడానికి, లయం చేసుకోడానికి - అని గూడా అర్థం.
ఉత్ + మేషం = ఉన్మేషం - అంటే మేషరాశితో ప్రారంభించి, ని + మేషం - అంటే మేషం దగ్గర కొచ్చి అయిపోవడం' - అని అర్థం చేసుకుంటే - ఈ రెండు స్థితులకు మధ్యన చిట్టచివరగా ఉండే మీనరాశి (జలరాశి) వస్తుంది. మీనం అంటే “మత్స్యం '. అంటే, సృష్టి ప్రళయాల మధ్య మీనరాశికి సంబంధించిన కథ ఉంటుంది అని అర్థం. ఈ కథ మత్స్య పురాణంలో • మత్స్యావతార కథగాను చెప్పబడుతుంది. ఇది రెండు సృష్టుల మధ్య జరిగే జలప్రళయనికి సంబంధించిన కథ
అమ్మవారు రెప్ప తెరిస్తే సృష్టి రెప్ప మూస్తే సృష్టి అంతం ప్రతి శ్వాస లో మనకు నిర్దేశించబడిన కాలం కరిగిపోతుంది అన్న విషయం తెలిసి కూడా వృధా చేయవద్దు అనే వివేకం కలిగి ప్రవర్తిస్తాము. ప్రతి కార్యము లో అది చిన్నదైనా పెద్దదైనా గాని ఆరంభం ఉంటాయి అవి ఉత్పన్న, విపన్నములు మనలో ప్రతిక్షణం జరుగుతూనే ఉంటాయి అవి జరుగుతున్నప్పుడే శుభం ప్రక్రియ ఆగిన నాడు జీవితం లేదు. ప్రతి క్షణం ప్రాణం తీసే ఊపిరి , విడిచే ఊపిరికి లోపల శ్వాస నాళాలు ముఖ్యమైన 14 నాడు సంకోచ వ్యాకోచాలకు లోనవుతాయి. ప్రతి నిషా సఖి లోపల ఉన్న ప్రాణాన్ని వదిలేస్తున్నాను ముందు నామములో కాలగమనం విలువలను తెలుసుకున్న సాధకుడు ఈ నామం లో శ్వాస విలువను తెలుసుకొని ప్రవర్తిస్తాడు మిత్రులు కూడా ఈ ఉచ్చ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి ఆ శ్వాస వేగంతోనే మిగిలిన అవయవాలు వాటి కార్యాలు అవి నిర్వహిస్తాయి శ్వాసప్రక్రియ అంటే అమ్మవారి కనురెప్పలు తెరవడం మూయడం ప్రపంచంలో ప్రతి క్రియ ఇచ్చిపుచ్చుకోవడం అనే పద్ధతి లోనే జరుగుతూ ఉంటుంది.
మేఘము నుంచి వర్షం కురిసి నదిలో సముద్రంలో పడి మళ్లీ అదే నీరు ఆవిరిగా మారి పైకి వెళ్లి మేఘం అవుతుంది అదే నీరు పైన వాయువుతో కలిసి క్రిందకు వస్తుంది. కింద అగ్నితో కలిసి పైకి వెలుతుంది. ఈ క్రమం సరైన విధానంలో నడిస్తేనే జీవులకు జగత్తుకు ప్రాణం ఉంటుంది. దానినే ఋతుధర్మాలుగా నిర్ణయించింది అమ్మవారు.
1) కనురెప్పలు తెరవడం మూయడంతో చతుర్దశ భువనాలను పుట్టించి లయం చేసుకోగలది.
2) మేషరాశితో ప్రారంభించి, మళ్ళీ మేషరాశి వచ్చే లోపల జరిగే సృష్టి ప్రళయాల మధ్య జలరాశి అయిన మీనరాశికి సంబంధించిన కథ జరుపునది. -
3) రెప్పపాటు కాలంలో సృష్టి ప్రళయాలను సృష్టించకలది - అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును.
🌷ఫలస్తుతి🌷
పని ప్రారంభించడానికి ముందు ఆరంభించిన తర్వాత ఎటువంటి ఆటంకాలు జరగకుండా కొనసాగించడానికి ఈ నామాన్ని నిత్యం జపం చేయాలి . బలహీనంగా ఉన్నవారికి, పిరికితనం ఎక్కువగా ఉన్నవారు, అనుమానంతో బాధపడేవారు, మానసిక పరిస్థితి బాగలేని వారు, ఈ నామాన్ని మంత్రంలా జపించాలి, ఎటువంటి సమస్య అయినా ఎదుర్కొనే ధైర్యం తెలివి లభిస్తుంది, పరిశోధన వృత్తిలో ఉన్నవారు రక్షణ శాఖలో పనిచేసే ఉద్యోగులకు , అందులో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ నామాన్ని నిత్యం జప, ధ్యానం , చేసిన సంపుటికరణ చేసిన మంచి ఫలితం ఉంటుంది.
🌷ఓం ఐం హ్రీం శ్రీo ఉన్మేష నిమిషోత్పన్న విపన్నభువనావళ్యి నమః🌷
🙏ఓం శ్రీ మాత్రే నమః.🙏
🔱(శక్తి ఆరాధన శ్రీచక్ర ఉపాసన)🔱

Comments
Post a Comment