SIVA leela


పూర్వం ఒక ఊరిలో ఓ పేద కుటుంబం ఉండేది. వాళ్ళు ఇంటి పెద్ద రోజు శివ పూజ చేస్తూ తనకి ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తనపని తాను చేసుకునేవాడు. అలా ఎన్నాళ్ళ నుండో పూజలు చేస్తూ తన బాధని శివయ్యకి వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు.
ఒక రోజు పార్వతీదేవి శివుడితో "స్వామి అతడు అనేక
సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు. కరుణించి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా." అంటే శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. పార్వతికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు! ఇప్పుడు మీరు ఆ భక్తుడిని కరుణించి పేదరికం మాపి ధనవంతుడిని చేయకపోతే ఊరుకొను అంది.
శివుడు మళ్ళి నవ్వి దేవి! నీకోరిక కాదనలేను కాని జరగబోయే విపరీతాలు నీవు ఎరుగవు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి. అనుభవిస్తే కాని కర్మ పరిపక్వం చెందదు. అన్నాడు. అయినా వినలేదు. పట్టుబట్టింది. శివుడు ఇక కాదనలేక దేవి! నీకోరిక ప్రకారం అతడిని ధనవంతుడిని చేస్తాను. చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు. అని అక్కడ మాయమయ్యాడు శివుడు. ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై "నిన్ను నేను రోజు గమనిస్తున్నాను. ఎందుకు అలా సేవలు చేస్తావు ఆ శివుడికి. భోళా శంకరుడు అన్నారు కానీ ఎప్పుడైనా కనికరించాడా? వృథాగా పూజలు చేయకు అని ఒక వజ్రపు రాయి చేతికి ఇచ్చి ఇది అమ్ముకొ చాలా డబ్బు వస్తుంది. హాయిగా బ్రతకవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఆ వజ్రపు రాయిని చూసే సరికి మతి పోయింది. ఎన్నో కోరికలు మనస్సులో మేలిగాయి. అది కొనాలి ఇది కొనాలి. ఇంకేదో చేయాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు. పెట్టెలో భద్రంగా దాస్తుంటే భార్య వచ్చింది. ఏమిటి అంటే జరిగింది చెప్పాడు. ఆవిడకి దానిమీద ఆశ పుట్టింది. చీరలు నగలు అంటూ వంద కోరికలు ఏకరువు పెట్టింది. ఇద్దరికీ వాదనలు జరిగాయి. భార్యని బయటికి గెంతి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్�

Comments

Popular posts from this blog

🙏ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః🙏

🔱🙏సహస్రశీర్షవదనా 🙏🔱