🔱🙏సహస్రశీర్షవదనా 🙏🔱

🔱🙏సహస్రశీర్షవదనా 🙏🔱


ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు “ సహస్రశీర్షవదనాయైనమః' అని చెప్పాలి.

సహస్ర = వెయ్యి లేదా అనంతమైన, 
శీర్ష = శిరస్సులతో, 
వదనా = ముఖములు కలది.

సహస్ర పదానికి 'వెయ్యి' అనే కాక “ అనంతం' అనే అర్థం కూడా వుంది. కాబట్టి, అమ్మవారికి వెయ్యి తలకాయలు, వెయ్యి ముఖాలు వుంటాయని పైకి అర్థమైనా - అనంతమైన తలలు, అనంతమైన ముఖాలు కలది అని అర్థం చెప్పుకోవాలి. ఈ వెయ్యి తలలు, వెయ్యి ముఖాలు వేరే ప్రత్యేకంగా ఉన్నట్లు అర్థం చేసుకోకూడదు. విశ్వంలో ఉన్న అనంతమైన జీవుల తలలన్నీ అమ్మవారి తలలుగాను, ముఖాలన్నీ అమ్మవారి ముఖాలుగాను ధ్యానించి దర్శించాలి.

ఒక వెయ్యి అనే అర్థమే కాదు, అనంతము అనేకము అనే అర్థం కూడా ఉంది 'స' అను శబ్దముతో పురుష సూక్తం  'హ' అను శబ్దం తో శ్రీ సూక్తం ప్రారంభమగును. సహా అను శబ్దము ప్రకృతి పురుషుల సమాగమము. ఆ 'సహా' నుండి జనించే సృష్టిని 'స్ర'అని పలుకుతారు.సహస్త్ర శబ్దము అత్యంత వైభవోపేతంగా మరియు అత్యంత శక్తివంతమైన మంత్రం. సూర్యుడు ఉదయించి పైకి వెళుతున్న కొలది ఆ శీర్షము లు కొంత వరకు మనకు కనిపిస్తూనే ఉంటాయి తర్వాత పూర్తిగా వ్యాపించి కనిపిస్తుంది, అమ్మవారు భానుమండల మధ్యస్థా గా ఉండి వేయి కిరణాలు జగత్తు నిండా నింపుతుంది పైకి వెళ్ళిన కొలది మనము ఆ కిరణాల్ని గలము కానీ చూడలేము దాని వంక చూసి లెక్కకట్టలేము, అమ్మ కి ఎంత మంది సంతానం ఉన్న ఎవరికి వారికి సరిపోయిన దాని కంటే వెయ్యి రెట్లు ప్రేమ కరుణ రక్షణ కల్పించగలదు ఆ శక్తి లోకములో ఒక అమ్మకి మాత్రమే ఉంది.

 ఈ తత్వం తెలుసుకున్నా సాధకుడు రోజులో ప్రతి ఒక్క నిమిషము వేలకువేలు కిరణాలను, ప్రకంపనలను పొందగలుగుతాడు కనిపించే ప్రతి అంశాన్ని ఆ కిరణాల ప్రభావం వల్ల చూడగలడు లేకపోతే ఏ వస్తువు కనపడదు. అంటే చూడగలిగే ప్రతి ముఖము ఆ పరాశక్తియే ఆ స్థితికి వచ్చిన నాడు కాలాన్ని కాలగమనాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోగలరు. అప్పుడు ఆ కిరణానికి ఎంతో దగ్గరగా వెళ్లగలడు, తెచ్చుకోగలడు, పొందగలడు.

'అనంతమైన శీర్షములు, ముఖములు కలది' అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును.

🌷ఫలస్తుతి🌷

అటంకంతో ఆగిపోయిన పనులకు, ఆర్థిక ఇబ్బందులు తొలుగుటకు ఈ నామమంత్రం ధ్యానం చేయాలి.. బాధ్యత లేని మనుషులు, బాధ్యత ఉన్నా ఉపాధి లేని వారు ఈ నామ మంత్రం మండలం రోజులు జపం చేస్తే మంచి ఫలితం ఉంటుంది..మేనేజ్మెంట్ వృత్తిలో ఉన్నవారికి కార్యనిర్వాహన లోపం లేకుండా మంచి కీర్తి అభివృద్ధి లభిస్తుంది.. అందినట్టే ఉండి చై జారిపోతున్న పనులకు ఇది చక్కటి పరిహార మంత్రం..
(వేరులతో ఉన్న పచ్చి పసుపుకొమ్ము ని మొక్కతో సహా అమ్మవారికి సమర్పించి ఈ నామ మంత్రాన్ని లలితా సహస్త్రనామంతో సంపుటికరణ చేసి ప్రతి అమావాస్య రోజు కుంకుమ పూజ చేస్తే వారికి ఉన్న ఆటంకాలు, ఆర్ధిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోతుంది. ఇది సూర్యుడు అస్తమించిన తర్వాత మొదలు పెట్టాలి , ఇలా చేసిన రోజు రాత్రి అంతా దీపం వెలిగేలా పెట్టాలి.) అమావాస్య మటుకే కాక, ప్రతి శుక్రవారం ఇలా చేయవచ్చు..

🙏ఓం ఐం హ్రీం శ్రీo సహస్రశీర్షవదనాయైనమః🙏

🌷ఓం శ్రీ మాత్రే నమః.🌷

🔱(శక్తి ఆరాధన శ్రీచక్ర ఉపాసన)🔱

Comments

Popular posts from this blog

🙏ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః🙏

SIVA leela